Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇర్ఫాన్‌ పఠాన్‌కు మక్కాలో పెళ్ళి: సఫా బేగ్‌తో నిక్కా.. లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో రిసెప్షన్!

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2016 (14:53 IST)
టీమిండియా క్రికెటర్ల పెళ్ళి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. నిశ్చితార్థాలు, పెళ్ళి వేడుకలంటూ ఒకవైపు క్రికెట్‌తో మరోవైపు పెళ్ళిళ్ళతో క్రికెటర్లు బిజీ అయిపోతున్నారు. శుక్రవారం రవీంద్ర జడేజా నిశ్చితార్థం అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో, టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ ఇంటివాడైపోయాడు. సౌదీ అరేబియా నగరం జెద్దాకు చెందిన ముస్లిం యువతి సఫా బేగ్‌ (21)ను పెళ్ళాడాడు.
 
గురువారం ఈ వివాహ వేడుక ముస్లింలు పరమ పవిత్ర నగరంగా భావించే మక్కాలో జరిగింది. కుటుంబ సభ్యులు, సమీప బంధువులు అతి కొద్ది మంది మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరైనట్లు సమాచారం. రెండేళ్ల క్రితం ఇర్ఫాన్, బేగ్‌ల మధ్య ఏర్పడ్డ పరిచయం... ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో పెళ్లి పీటల వరకు వచ్చింది. 31 ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్- సఫా బేగ్‌ల వివాహ వేడుక గురువారం జరుగగా ఆ రోజు రాత్రి డిన్నర్ ఏర్పాటు చేశారు. 
 
కాగా ఇర్ఫాన్ పఠాన్ కుటుంబీకులు శుక్రవారం భారత్ చేరుకోగా, సఫా కుటుంబం కొద్ది రోజులాగి భారత్ వస్తారని తెలుస్తోంది. ఇర్ఫాన్ పఠాన్ మార్చిలో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో ఈ రిసెప్షన్ ఉంటుందని తెలుస్తోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments