Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ప్రపంచ కప్ : ప్రారంభ మ్యాచ్‌కు ప్రేక్షకులు ఎక్కడ?

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2023 (16:25 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, గురువారం తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య గుజరాత్ రాష్ట్రంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. దేశంలోనే అతిపెద్ద స్టేడియంగా పేరుగాంచిన ఈ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ప్రేక్షకులు లేక వెలవెలబోయింది. ఈ స్టేడియంలో మొత్తం ప్రేక్షకుల కెపాసిటీ 1.32 లక్షలు కాగా, కనీసం రెండు వేల మంది లేక వెలవెలబోయింది. స్టేడియం మొత్తం దాదాపుగా ఖాళీగానే కనిపించింది. 
 
భారత్‌లో వరల్డ్ కప్ టోర్నీ సన్నాహాలు ఆలస్యంగా మొదలుకావడం, టిక్కెట్ల బుకింగ్‌లో సమస్యలు ప్రేక్షకుల లేమికి కారణాలుగా తెలుస్తున్నాయి. వరల్డ్ కప్ మ్యాచ్‌లంటే కొన్ని నెలల ముందుగానే టిక్కెట్లు మొత్తం ఖాళీ అయిపోయి వుంటాయి. కానీ, ఇంగ్లండ్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌కు టిక్కెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ప్రేక్షకులు వాటిని కొనుగోలు చేసేందుకు ఏమాత్రం ఉత్సాహం చూపించలేదు. 
 
అయితే, గుజరాత్ అధికారపక్షమైన భారతీయ జనతా పార్టీ ఈ మ్యాచ్ కోసం 40 వేల టిక్కెట్లను రిజర్వు చేసుకున్నట్టు నిర్ధారించింది. ఇటీవల కేంద్ర మహిళా బిల్లు ఆమోదింపజేసుకున్న నేపథ్యంలో ఆ 40వ టిక్కెట్లన మహిళలకు ఉచితంగా పంపిణీ చేస్తామని, వారికి ఉచితంగా భోజనం, టీ కూపన్లు కూడా అందజేస్తామని చెప్పింది. కానీ ఆ  40 వేల టిక్కెట్ల సంగతి ఏమైందో తెలియదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజలు చిత్తుగా ఓడించినా సరే మూడు రాజధానులకే కట్టుబడివున్నాం : బొత్స సత్తిబాబు

బెంగళూరు: డెంగ్యూ జ్వరంతో 27 ఏళ్ల యువకుడి మృతి

పానీ పూరీ తింటున్నారా? కృత్రిమ రంగులు, క్యాన్సర్‌కు కారకాలున్నాయట!

పంచాయతీరాజ్ శాఖ ఖజానా ఖాళీ.. నాలాంటివాడు జీతం తీసుకోవడం తప్పు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Video)

వెంకయ్య నాయుడు జన్మదినం.. ప్రధాని చేతుల మీదుగా పుస్తకాల ఆవిష్కరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా ప్రభాస్.... ఎలా?

కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 555 Cr+ వసూళ్లు

భారతీయుడు2 లో క్యాలెండర్ సాంగ్ చేస్తున్న మోడల్ డెమి-లీ టెబో

కల్కి మొదటి వారాంతం హిందీ, ఉత్తర అమెరికా కలెక్టన్ల వివరాలు

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తర్వాతి కథనం
Show comments