Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ వరల్డ్ కప్ : స్కాట్లాండ్‌పై అష్టకష్టాలతో గెలిచిన న్యూజిలాండ్!

Webdunia
మంగళవారం, 17 ఫిబ్రవరి 2015 (10:37 IST)
వరల్డ్ కప్ మెగా టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన క్రికెట్ పసికూనలు ప్రధాన జట్లకు పగటి పూటే చుక్కలు చూపిస్తున్నాయి. నిన్నటికి నిన్న గ్రూపు బిలో వెస్టిండీస్‌స్‌ను ఐర్లాండ్ జట్టు చిత్తు చేసింది. అలాగే, మంగళవారం న్యూజిలాండ్ జట్టుకు స్కాట్లాండ్ బౌలర్లు ముచ్చెమటలు పోయించారు. 143 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన కివీస్ ఆటగాళ్లు ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయారు. స్కాట్లాండ్ బౌలర్లు కివీస్ బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తిచారు.
 
మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన స్కాట్లాండ్ బ్యాటింగ్‌కు దిగింది. తన 50 ఓవర్ల కోటాను పూర్తి చేయకముందే.. 36.2 ఓవర్లలో ఆ జట్టు 142 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత 143 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో... కివీస్ జట్టు 24.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు చివర్లో స్వల్ప వ్యవధిలో 4 వికెట్లు చేజార్చుకుంది. 
 
లక్ష్యం పెద్దది కాకపోవడంతో కివీస్ జట్టు బతికిపోయింది. కివీస్ ఇన్నింగ్స్‌లో కేన్ విలియమ్సన్ (38) టాప్ స్కోరర్. ఇలియట్ 29 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా బరిలో దిగిన కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ 15 పరుగులతో నిరాశపరిచాడు. స్కాట్లాండ్ బౌలర్లలో వార్డ్ లా, డేవీ చెరో 3 వికెట్లు తీశారు. స్కాటిష్ జట్టును ఆరంభంలో హడలెత్తించిన కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. 

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

జగన్ జల్సా ప్యాలెస్‌లో ఏమున్నాయి.. వాటికి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా?

పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి శాపమే : సీఎం చంద్రబాబు

వెలుగు చూడాల్సిన జగన్ జల్సా ప్యాలెస్ రహస్యాలు చాలా ఉన్నాయ్... : మంత్రి నారా లోకేశ్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

Show comments