Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా బిగ్ బాష్ సీజన్-5లో ఆడనున్న క్రిస్ గేల్!

Webdunia
శుక్రవారం, 15 మే 2015 (18:26 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పరుగుల వర్షం కురిపిస్తోన్న వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ సీజన్ 5లో ఆడనున్నాడు. బీబీఎల్ సీజన్ 5లో మెల్ బోర్న్ రెనిగేడ్స్ తరపున ఆడేందుకు క్రిస్ గేల్ సంతకం చేశాడని రెనిగేడ్స్ ట్వీట్ చేసింది. ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్‌తో కలిసి గేల్ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగుతాడని రెనిగేడ్స్ తెలిపింది. 2015-16కు రెనిగేడ్స్ తరపున బిగ్ బాష్‌లో ఆడేందుకు గేల్ ఒప్పందం చేసుకున్నట్టు ఆ ఫ్రాంఛైజీ వెల్లడించింది.
 
కాగా క్రిస్ గేల్‌పై రికార్డులు ఎన్నో వున్నాయి. ఇప్పటికే ఐపీఎల్‌లో ఫోర్లు, సిక్సర్లతో సెంచరీ సాధించిన ఆటగాడిగా పేరున్న క్రిస్ గేల్.. వరల్డ్ కప్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఫిబ్రవరిలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 138 బంతుల్లో గేల్ 215 పరుగులు సాధించాడు. ఐసీసీ ట్వంటీ-20 ప్లేయర్ల ర్యాకింగ్స్‌లో క్రిస్ గేల్ ఆరో స్థానంలో ఉన్నాడు.  

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments