Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ.. ధోనీ.. అని అరిచిన ఫ్యాన్స్.. గుర్రుగా చూసిన కోహ్లీ.. (video)

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (17:22 IST)
టీమిండియాకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ధోనీకి తర్వాత వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను రంగంలోకి దించింది. అయితే ధోనీ స్థాయికి రిషబ్ పంత్ రాణించలేకపోతున్నాడు. ఒక్కో మ్యాచ్‌లో రిషబ్ పంత్ వికెట్ కీపింగ్‌లో తేలిపోతున్నాడు. 
 
అంతేగాకుండా రిషబ్ పంత్ మైదానంలో వున్నంత సేపు.. క్రికెట్ ఫ్యాన్స్ ధోనీ.. ధోనీ అని అరుస్తున్నారు. ఇలా చేయడం ఇతర క్రీడాకారుల ఆత్మవిశ్వాసాన్ని కించపరిచినట్లు అవుతుందనే ఉద్దేశంతో అలా కేకలు వేయకండని ఫ్యాన్సుకు కోరుతున్నాడు విరాట్ కోహ్లీ. 
 
ఇలాంటి సీనే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది. ఆసీస్‌తో జరిగిన చివరి రెండు మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా బరిలోకి దిగాడు. రిషబ్ పంత్‌ కంటే ఇతను మెరుగ్గా రాణించాడు. అయినా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్‌కు కుల్దీప్ యాదవ్ విసిరిన బంతి.. బ్యాటును తాకి పక్కకుపోయింది. ఈ బంతిని రాహుల్ చేజార్చుకున్నాడు. 
 
వెంటనే క్రికెట్ ఫ్యాన్స్ ధోనీ.. ధోనీ.. అంటూ అరవడం మొదలెట్టారు. ఆ శబ్ధాన్ని విని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ వైపు గుర్రుగా చూశాడు. అంతే ఫ్యాన్స్ అలా అరవడం ఆపేశారు. వెంటనే రాహుల్.. రాహుల్ అంటూ అరిచారు. దీంతో వికెట్ కీపర్‌గా రాహుల్ కొనసాగించాలని కోహ్లీకి చాలామంది సీనియర్ క్రికెటర్లు కోరుకుంటున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments