Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్ చేతులమీదుగా.. సింధుకు రూ.60 లక్షల బీఎండబ్ల్యూ కారు..!

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకాన్ని ఖరారు చేసిన భారత స్టార్ క్రీడాకారిణి, తెలుగమ్మాయి పీవీ సింధుకు ఖరీదైన కానుకలు అందనున్నాయి. గురువారం రాత్రి రియోలో బాడ్మింటన్ మహిళల సింగిల్స్ సె

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2016 (09:25 IST)
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకాన్ని ఖరారు చేసిన భారత స్టార్ క్రీడాకారిణి, తెలుగమ్మాయి పీవీ సింధుకు ఖరీదైన కానుకలు అందనున్నాయి. గురువారం రాత్రి రియోలో బాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సత్తా చాటిన సింధు.. తన ప్రత్యర్థిపై విజయం సాధించి ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింధు ధీటుగా రాణించి పతకం కైవసం చేసుకుంటే.. ఆమెకు ప్రశంసలతో పాటు కానుకల వర్షం కురిపించేందుకు స్పాన్సర్లు రెఢీ అవుతున్నారు.
 
ఈ మ్యాచ్‌లో సింధు విజయం సాధించిన వెంటనే అక్కడే ఉన్న తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు.. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ముంబై మాస్టర్స్ ఫ్రాంచైజీ సహ యజమాని చాముండేశ్వరీనాథ్ ఆమెకు ఖరీదైన గిప్ట్‌ను ప్రకటించారు. ఇండియాకి మరో పతకం ఖరారు చేసిన సింధుకు రూ.60 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు చాముండి ప్రకటించారు. 
 
రియో ఒలింపిక్స్ నుంచి ఈ నెల 28న సింధు హైదరాబాద్ చేరుకుంటుందని చెప్పిన చాముండి... తర్వాతి రోజే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ఈ కారును సింధుకు అందజేయనున్నట్లు వెల్లడించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments