Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిక్స్‌లతో చితక్కొట్టాడు.. బ్రాత్ వైట్ దెబ్బకు ధోనీ సేన ధీటుగా రాణిస్తుందా?!

భారత్-వెస్టిండీస్‌ల మధ్య ఈ నెల 27 నుంచి ట్వంటీ-20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ ట్వంటీ-20 సిరీస్ టీమిండియాకు బలపరీక్షేనని క్రీడా పండితులు అంటున్నారు. నాలుగు నెలల క్రితం జరిగిన ట్వంటీ-20లో ఇంగ్లండ్‌తో జరిగ

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2016 (17:26 IST)
భారత్-వెస్టిండీస్‌ల మధ్య ఈ నెల 27 నుంచి ట్వంటీ-20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ ట్వంటీ-20 సిరీస్ టీమిండియాకు బలపరీక్షేనని క్రీడా పండితులు అంటున్నారు. నాలుగు నెలల క్రితం జరిగిన ట్వంటీ-20లో ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో విండీస్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్.. వరుస సిక్సర్లలో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
 
ప్రస్తుతం బ్రాత్‌వైట్ విండీస్ ట్వంటీ-20 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియాతో జరిగే టీ-20 మ్యాచ్‌లకు కూడ బ్రాత్‌వైట్ కెప్టెన్సీ వహిస్తాడు. కాగా, గ‌త టీ20 ప్రపంచకప్‌లలో రెండు సార్లు విజేతగా నిలిచిన వెస్టిండీస్‌కు సార‌థ్యం వ‌హించిన వెస్టిండీస్ టీమ్‌ కెప్టెన్‌ డారెన్‌ సామికి జట్టులో స్థానం లభించకపోవడం గమనార్హం. బ్రాత్‌వైట్ కెప్టెన్సీ సారథ్యంలో ధోనీ సేన ఏమేరకు రాణిస్తుందో వేచి చూడాలి. 
 
వెస్టిండీస్ ట్వంటీ-20 జట్టు వివరాలు: 
ఆండ్రీ ఫ్లెచర్, ఆండ్రీ రస్సెల్, కార్లోస్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), క్రిస్ గేల్, బ్రావో, ఇవిన్ లియోస్, జాసన్ హోల్డర్, జాన్సన్ కార్లోస్, కిరోన్ పొలార్డ్, సిమ్మన్స్, మార్లోన్ శ్యామేల్స్, శ్యాముయేల్ బంద్రీ, సునీల్ నరేన్. 
 
ఇన్ : సునీల్ నరేన్, పొలార్డ్ 
అవుట్ : సామి, సులేమన్ బెన్, ఆశ్లే నర్స్, డేనెష్ రాందిన్, జెరోమ్ టైలర్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

3D map: నక్షత్ర నిర్మాణానికి కీలకం.. పాలపుంతలోని తొలి త్రీడీ మ్యాప్ విడుదల

ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తి: ఢిల్లీ హోటల్ గదిలో బ్రిటన్ యువతిపై అత్యాచారం

జనసంద్రంగా మారిన పిఠాపురం... జయకేతనం సభ ప్రారంభం!!

ఫ్లైట్ ల్యాండ్ కాగానే చెలరేగిన మంటలు.. విమానం రెక్కలపై ప్రయాణికుల ఆర్తనాదాలు..

ఏప్రిల్ 15 - 20 మధ్య ప్రధాని నరేంద్ర మోడీ రాక!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samyuktha: హైదరాబాద్ లో అఖండ 2 షూట్, బాలక్రిష్ణ వుంటే అందరికీ ఎనర్జీనే: సంయుక్తమీనన్

అతిధి పాత్రతో పరదా లో సమంత తెలుగులోకి రీ ఎంట్రీ

Vijay Deverakonda : నాని, విజయ్ దేవరకొండల మధ్య పుకార్లు ముగిసినట్లేనా !

లయ, నేను కలసి సినిమా చేస్తున్నాం, 90sకి సీక్వెల్ వుంటుంది : శివాజీ

Sankranthiki Vastunnam : సంక్రాంతికి వస్తున్నాం రికార్డు బద్ధలు.. ఓటీటీ, టీఆర్పీ రేటింగ్స్‌ అదుర్స్

తర్వాతి కథనం
Show comments