Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెల్‌బోర్న్‌లోని భారతీయ క్రికెట్ అభిమానులకు మెక్‌కల్లమ్ విజ్ఞప్తి!

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (16:13 IST)
వరల్డ్ కప్ ఫైనల్ పోటీని వీక్షించేందుకు వచ్చే భారతీయ ప్రేక్షకులకు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండెన్ మెక్ కల్లమ్ ఓ విజ్ఞప్తి చేశాడు. మొన్నటికి మొన్న సఫారీలతో సెమీస్‌కు ముందు ఆక్లాండ్ వాసులకు లేఖ రాసిన ఈ స్టార్ కెప్టెన్ ఈసారి భారత ఫ్యాన్స్‌ మద్దతు కోరుతున్నాడు. ఆస్ట్రేలియా జట్టుతో ఫైనల్ సందర్భంగా భారత అభిమానులు తమకు మద్దతుగా నిలవాలంటూ ఓ లేఖ రాశాడు. ఆ లేఖ పూర్తి పాఠం ఇదిగో... 
 
భారత్‌లోని ప్రతి ఒక్క క్రికెట్ అభిమానికి... 
వరల్డ్ కప్ నెగ్గాలన్న మా బలమైన ఆకాంక్ష మీకర్థమైందని నాకు తెలుసు. మీరు మాపై చూపే వల్లమాలిన అభిమానం నాకు కొత్తేమీ కాదు. థాంక్ యూ! ప్రతి బంతికీ ప్రోత్సహించడం ద్వారా, ఫైనల్లో అన్ని అంశాల్లో న్యూజిలాండ్‌కు మద్దతివ్వాలని కోరుతున్నా. ఇది మా కెరీర్లోనే అతి పెద్ద మ్యాచ్. వందల కోట్ల గొంతుకల మాకోసం నినదిస్తుంటే, ఆ ప్రభావం తప్పక కనిపిస్తుంది.
 
మీ... 
బ్రెండన్ మెక్ కల్లమ్
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments