Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేకింగ్ న్యూస్... మిథాలీరాజ్ వరల్డ్ రికార్డ్...(Details)

భారత మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఒన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో ఇప్పటివరకూ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరున నమోదైన 5992 పరుగులు రికార్డున చెరపేసి 5993 పరుగులతో రికార్డు సృష్టించింది. ఎడ్వర్డ్స్ ఈ పరుగులు రికార్డున 191 మ్యాచుల్లో

Webdunia
బుధవారం, 12 జులై 2017 (17:20 IST)
భారత మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఒన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో ఇప్పటివరకూ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరున నమోదైన 5992 పరుగులు రికార్డున చెరపేసి 5993 పరుగులతో రికార్డు సృష్టించింది. ఎడ్వర్డ్స్ ఈ పరుగులు రికార్డున 191 మ్యాచుల్లో ఆడి సాధించగా మిథాలీ 183 మ్యాచులతోనే సాధించేసింది.
 
మైదానంలో ప్రశాంతంగా కదులుతూ ఆటను ప్రత్యర్థి జట్టునుంచి లాగిపడేయడంలో మిస్టర్ కూల్ ధోనీని మించిన ప్లేయర్ ఆమె. ఒక రకంగా చెప్పాలంటే టీమిండియా పురుషుల జట్టులో ఏ ఒక్కరికీ లేనంత సీనియారిటీ ఆమెకుంది. సీనియర్ ఆటగాడు ధోనీ సైతం 13 ఏళ్ల నుంచే భారత్‌ తరపున ఆడుతుండగా 19 ఏళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోస్ట్ సీనియర్ క్రికెటర్ మిథాలి.
 
భారత మహిళల క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ అరుదైన ఘనతను సాధించేసింది. అంతేగాకుండా 6 వేల పరుగుల మైలు రాయి దాటిన తొలి మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. మిథాలీ చాంపియన్స్‌ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తోంది. మిథాలీకి రికార్డులు కొత్తేమి కాదు. ఆమె ఆడిన తొలి వన్డే మ్యాచ్‌లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించింది. 1999లో ఐర్లాండ్‌పై మొదలైన ఆమె ప్రస్థానం ఇప్పటివరకు కొనసాగుతుంది. ఇంత కాలం క్రికెట్‌ ఆడుతున్న మహిళా క్రికెటర్‌గా కూడా ఆమె గుర్తింపు పొందింది. ఇక టెస్టుల్లో డబుల్ సెంచరీ, మహిళా టెస్టుల్లో 10 టెస్టులు ఆడటం ఆమె అదనపు రికార్డు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పండగ వేళ ప్రయాణికుల నిలువు దోపిడీ!

ప్రయాణికుడిని చితకబాదిన టీటీఈ.. ఎందుకో తెలుసా? (Video)

ఏపీలో విద్యా సంస్కరణలు... ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఆదర్శ పాఠశాల!

Pawan Kalyan: గ్రామాల్లో పవన్ పర్యటన.. టెంట్లలోనే బస చేస్తారు

తిరుపతి తొక్కిసలాట- గాయపడిన వారికి శ్రీవారి వైకుంఠద్వార దర్శనం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆనంద్ దేవరకొండ లాంచ్ చేసిన బాపు నుంచి అల్లో నేరేడల్లో పిల్లా సాంగ్

స్ట్రైట్ సాంగ్ కంటే డబ్బింగ్ సాంగ్ రాయడం కష్టం ఫ గీత రచయిత కేకే (కృష్ణకాంత్)

అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాల్బీ విజన్ గ్రేడింగ్ చూసి థ్రిల్ అయ్యా : SS రాజమౌళి

ఎవరికి గేమ్ ఛేంజర్ అవుతుంది...రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రివ్యూ

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

తర్వాతి కథనం
Show comments