Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్ ఖాన్ మద్దతు.. వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీశాంత్..?

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (18:48 IST)
హిందీ బిగ్ బాస్‌లో మాజీ టీమిండియా బౌలర్ శ్రీశాంత్ కంటిస్టెంట్‌గా వున్నాడు. బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి.. శ్రీశాంత్‌ వివాదాలకు తావిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ బిగ్ బాస్ సీజన్ 12లో వున్న శ్రీశాంత్‌‌కు మద్దతు లభించింది.


సల్మాన్ ఖానే శ్రీశాంత్‌కు మద్దతు ప్రకటించాడు. దీంతో శ్రీ కంటివెంట నీళ్లు ధారగా ప్రవహించాయి. సల్మాన్ నుంచే తనకు సపోర్ట్ దొరకడంతో శ్రీశాంత్ కన్నీళ్లు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్వటం మొదలెట్టేశాడు. 
 
ఇంతకీ ఏమైందంటే.. లగ్జరీ బడ్జెట్ టాస్కులో భాగంగా హౌస్ మేట్స్ శ్రీశాంత్ పట్ల వ్యవహరించిన తీరుపై సల్మాన్ ఫైర్ అయ్యాడు. శ్రీశాంత్ క్రికెటర్‌గా భారత జట్టుకు ఎంతో చేశాడని.. అతని గురించి ఏం తెలుసునని మాట్లాడుతున్నారని ఇతర కంటిస్టెంట్ రోహిత్, సురభిలపై సల్మాన్ మండిపడ్డాడు. 
 
శ్రీశాంత్‌కు బిగ్ బాస్ హౌస్‌లో ఎదురైన అనుభవాలను గుర్తుచేస్తూ.. అతనితో హౌస్‌మేట్స్ వ్యవహరించిన తీరును చూపిస్తూ.. ఓ వ్యక్తిగా వాటిని తట్టుకోవడం చాలా కష్టమని సల్మాన్ చెప్తున్నట్లు గల వీడియో ప్రోమో విడుదలైంది. దీంతో సల్మాన్ మద్దతు లభించడంతో ఆనందం తట్టుకోలేక శ్రీశాంత్ వెక్కి వెక్కి ఏడ్వటానికి సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

తర్వాతి కథనం
Show comments