క్రికెటర్ పృథ్వీ షాపై దాడి కేసు- భోజ్‌పురి నటి సప్నా గిల్ అరెస్ట్

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (18:00 IST)
Sapna
ముంబై తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న భారత క్రికెటర్ పృథ్వీ షాపై ఇటీవల ఓ మహిళతో పాటు అభిమానులు దాడికి పాల్పడ్డారు. ముంబైలోని శాంటా క్రూజ్ ప్రాంతంలో ఈ దాడి చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో షాపై దాడి చేసిన దుండగులను సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్, ఆమె స్నేహితురాలుగా గుర్తించారు. 
 
రవి కిషన్, దినేష్ లాల్ యాదవ్ వంటి ఇండస్ట్రీ సూపర్ స్టార్స్‌తో భోజ్‌పురి సినిమాలో పనిచేసిన నటి సప్నా. ఇన్‌స్టాగ్రామ్‌లో 2,19,000 మంది ఫాలోయర్స్‌ను కలిగివుంది. సప్నా, చండీగఢ్‌కు చెందినవారు. ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు.
 
సప్నా 'కాశీ అమర్‌నాథ్', 'నిర్హువా చలాల్ లండన్' వంటి సినిమాలతో పాటు ఇటీవల 2021లో విడుదలైన 'మేరా వతన్' వంటి సినిమాల్లో నటించింది.
 
గిల్- ఆమె స్నేహితుడు షాతో సెల్ఫీ అడిగారు. మొదట్లో వారి అభ్యర్థనలకు ఓకే చెప్పిన షా.. తర్వాత రెండో సెల్ఫీకి మాత్రం అంగీకరించలేదు. దీంతో వాగ్వాదం జరిగింది. 
 
తర్వాత పృథ్వీ తన స్నేహితుడితో కలిసి తన కారులో హోటల్ ప్రాంగణం నుంచి బయలుదేరినప్పుడు, సప్న, ఆమె స్నేహితురాలు మరికొంతమంది అతని కారును వెంబడించి, ఓషివారా సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అడ్డగించి, విండ్‌షీల్డ్‌ను పగలగొట్టారు. దాడి చేశారు. ఈ ఘటనపై నటి సప్నాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

Pawan Kalyan: పీఠాపురంలో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేయనున్న పవన్

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

తర్వాతి కథనం
Show comments