Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీకి భారతరత్న ఇవ్వాలి : హోంశాఖకు ఏఐజీఎఫ్ లేఖ

భారత క్రికెట్ జట్టుకు వెన్నెముకగా ఉన్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఈ యువ క్రికెటర్ అన్ని ఫార్మెట్లలో దంచికొడుతున్నాడు. పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. దీంతో కోహ్లీకి భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ

Webdunia
శనివారం, 25 జూన్ 2016 (17:18 IST)
భారత క్రికెట్ జట్టుకు వెన్నెముకగా ఉన్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఈ యువ క్రికెటర్ అన్ని ఫార్మెట్లలో దంచికొడుతున్నాడు. పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. దీంతో కోహ్లీకి భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. సచిన్ తర్వాత అంతటి అర్హత గల వ్యక్తి కోహ్లీనేనని 'ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్' గట్టిగా భావిస్తోంది. 
 
ఈ భావన వచ్చిందే తడవుగా కేంద్ర హోంశాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆ సంస్థ ఓ లేఖ రాసింది. ప్రపంచ స్థాయి ఉత్తమ బ్యాట్స్‌మెన్ అయిన కోహ్లీ తన ప్రస్తుత ఫామ్‌ విషయంలో ఉన్నత స్థితిలో ఉన్నాడనీ, 27 సంవత్సరాల ఈ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఈ యేడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియా టూర్ నుంచి ఐపిఎల్ వరకు విజృంభించి ఆడినట్టు ఆ లేఖలో గుర్తు చేసింది. పైగా, భారత క్రికెట్ జట్టుకు ఒంటి చేత్తో ఎన్నో విజయాలు చేకూర్చి పెడుతున్నారని లేఖలో పేర్కొంది. అందువల్ల కోహ్లీకి భారత రత్న పురస్కారానికి అర్హుడేనంటూ అందులే పేర్కొంది.
 
నిజానికి క్రీడా విభాగంలో ప్రస్తుతం సచిన్ టెండూల్కర్‌కు మాత్రమే ఈ అత్యున్నత పురస్కారం దక్కింది. సచిన్ కంటే హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్‌కు ఇవ్వాలన్న డిమాండ్లు వచ్చాయి. కానీ, గత యూపీఏ ప్రభుత్వం సచిన్‌కు భారత రత్న పురస్కారాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న పాపులారిటి, భారత క్రికెట్‌కు అతని సేవల దృష్ట్యా ఇతర సీనియర్ క్రికెటర్లకు కూడా లేని భారత రత్న డిమాండ్ కోహ్లీ విషయంలో తెరపైకి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments