Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను భారత క్రికెటర్‌ను కాదు.. నాకు నా దేశం ముఖ్యం : ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో అంచె పోటీల్లో భాగంగా, ఫైనల్ పోరులో ఆడకుండా స్వదేశానికి వెళ్లిపోయిన ఇంగ్లండ్ క్రికెకట్ర బెన్ స్టోక్స్‌పై పలువురు క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఐపీఎల్ వేలం పాటల్లో అత

Webdunia
బుధవారం, 24 మే 2017 (10:06 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో అంచె పోటీల్లో భాగంగా, ఫైనల్ పోరులో ఆడకుండా స్వదేశానికి వెళ్లిపోయిన ఇంగ్లండ్ క్రికెకట్ర బెన్ స్టోక్స్‌పై పలువురు క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఐపీఎల్ వేలం పాటల్లో అత్యధిక ధర పలికి ఆటగాడిగా రికార్డు సృష్టించిన బెన్ స్టోక్స్.. రైజింగ్ పూణె సూపర్‌జైంట్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో సొంత గడ్డపై త్వరలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే టోర్నీలో పాల్గొనేందుకు ఐపీఎల్ ఫైనల్‌లో ఆడకుండా స్వదేశానికి వెళ్లిపోయిన విషయం తెల్సిందే. దీనిపై ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ విమర్శించాడు. 
 
దీనిపై బెన్ స్టోక్స్ స్పందిస్తూ.. టోర్నీకి ముందే తన జట్టు యాజమాన్యానికి తనకు దేశం తరపున ఆడటం ముఖ్యమన్న విషయం స్పష్టం చేశానని చెప్పాడు. చివరి రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండదని ముందే సమాచారం ఇచ్చానని అన్నాడు. దేశం తరపున ఆడటం ముఖ్యం కనుకే తాను ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహాల్లో పాల్గొనేందుకు జట్టుతో కలిసి బయల్దేరానని తెలిపాడు. 
 
ఇందులో తన తప్పేమీ లేదన్నారు. జట్టుతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే ఐపీఎల్ కంటే దేశం ముఖ్యమని భావించి వెళ్లినట్టు చెప్పాడు. కాగా, ఈ టోర్నీలో అత్యధిక ధర పలికిన బెన్ స్టోక్స్ తన ధరకు న్యాయం చేస్తూ 12 మ్యాచ్‌లలో 316 పరుగులు చేసి, 21 వికెట్లు తీశాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా స్టోక్స్ గుర్తింపు పొందాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments