Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక మహిళా క్రికెటర్లకు ఐపీఎల్ మ్యాచ్‌లు..

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ క్రికెట్ ఇక పురుషులకే కాదు.. మహిళలకూ సొంతం కానుంది. కేవలం పురుషుల కోసం నిర్వహిస్తున్న ట్వంటీ-20 లీగ్‌.. ఇకపై మహిళల కోసం కూడా టీ-20 లీగ్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంద

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (11:16 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ క్రికెట్ ఇక పురుషులకే కాదు.. మహిళలకూ సొంతం కానుంది. కేవలం పురుషుల కోసం నిర్వహిస్తున్న ట్వంటీ-20 లీగ్‌.. ఇకపై మహిళల కోసం కూడా టీ-20 లీగ్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. 
 
ఇప్పటికే ఐపీఎల్ పది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న తరుణంలో.. ఐపీఎల్ పోటీలను మహిళల కోసం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 2018లో జరిగే టోర్నీ మ్యాచ్‌ల్లో మహిళా క్రికెటర్లతో కొన్ని ఎగ్జిబిషన్ మ్యాచ్‌లను నిర్వహించడానికి బీసీసీఐ ప్రణాళికలు వేస్తోంది. 
 
ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా ప్రయోగాత్మకంగా కొన్ని మహిళల టీ20 మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తుంది. ఈ మ్యాచ్‌లు నిర్వహించేందుకు చాలా కసరత్తు చేయాల్సి వుందని.. సీవోఏ మహిళా సభ్యురాలు డయానా ఎడుల్జీ అభిప్రాయపడ్డారు. 
 
ఇప్పటికే భారత మహిళల ఐపీఎల్‌ను ప్రారంభించడం ద్వారా మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరగడంతో పాటు ఆటలో నైపుణ్యాలను పెంపొందిస్తుందని టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ పేర్కొంది. ఇంగ్లాండ్‌ మహిళలకు ఇక్విలెంట్‌ సూపర్‌ లీగ్‌, ఆస్ట్రేలియాకు బిగ్‌ బాష్‌ లీగ్‌లు ఉన్నాయని ఈ తరహాలోనే భారత్‌లో కూడా మహిళా ఐపీఎల్ ప్రారంభించాలని బీసీసీఐకి సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments