Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 14 సీజన్ పునఃప్రారంభం ఎపుడంటే...

Webdunia
సోమవారం, 26 జులై 2021 (07:28 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ మళ్లీ పునఃప్రారంభంకానుంది. కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి కారణంగా ఈ టోర్నీని బీసీసీఐ రద్దు చేసింది. ఈ ఆగిపోయిన ఐపీఎల్ 14వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు. 
 
భార‌త క్రికెట్ బోర్డు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ను మ‌రోసారి యూఏఈలో నిర్వ‌హించ‌బోతున్న‌ద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఐపీఎల్‌కు సంబంధించి జైషా ఇప్ప‌టికే యూఏఈ సాంస్కృతిక‌, యువ‌జ‌న, సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి షేక్ నహ్యాన్‌ను క‌లిసి మాట్లాడారు.
 
తొలిరోజైన సెప్టెంబ‌రు 19న డిఫెండింగ్ చాంపియ‌న్స్ ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం అక్టోబ‌రు 10న క్వాలిఫ‌య‌ర్ 1, అక్టోబ‌ర్ 11న ఎలిమినేట‌ర్‌ మ్యాచ్‌లు జ‌రుగ‌నున్నాయి. అక్టోబ‌రు 13న క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్ నిర్వ‌హించ‌నున్నారు. 
 
అక్టోబ‌రు 15న ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగ‌నుంది. మేం సెప్టెంబ‌రు 19న ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్‌కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌తో ఐపీఎల్-14వ సీజ‌న్‌ను పున‌రుద్ధ‌రించ‌నున్నాం. అక్టోబ‌రు 10, 13 తేదీల్లో క్వాలిఫ‌య‌ర్ 1, 2 మ్యాచ్‌లు నిర్వ‌హిస్తాం. అక్టోబ‌రు 11న ఎలిమినేట‌ర్ మ్యాచ్ జ‌రుగుతుంది. అన్ని మ్యాచ్‌ల‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వివరాలను త్వ‌ర‌లో అన్ని టీమ్‌లకు తెలియ‌జేస్తాం అని బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments