Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేకింగ్ న్యూస్: బాల్ ట్యాంపరింగ్.. ఆసీస్ టీమ్ స్మిత్‌పై వేటు

మైదానంలో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే క్రికెటర్లున్న ఆస్ట్రేలియా జట్టు ఈసారి బాల్ ట్యాంపరింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ ఓపెనర్ కేమరాన్

Webdunia
ఆదివారం, 25 మార్చి 2018 (15:12 IST)
మైదానంలో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే క్రికెటర్లున్న ఆస్ట్రేలియా జట్టు ఈసారి బాల్ ట్యాంపరింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ ఓపెనర్ కేమరాన్ బాన్‌క్రాఫ్ట్ మైదానంలో బాల్ ట్యాంపరింగ్ చేస్తూ బుక్కయ్యాడు.

పసుపు రంగు చిప్‌లాంటి పరికరంతో బంతి ఆకారాన్ని మారుస్తూ కెమెరాలకు దొరికిపోయాడు. దీనిని గమనించిన అంపైర్లు వివరణ కోరారు. కానీ ప్యాంటు జేబులోంచి కళ్లద్దాలు పెట్టుకుని సంచిని తీసి చూపించాడు అమాయకుడిగా వెళ్లిపోయాడు. దీంతో మ్యాచ్ కొనసాగింది. 
 
అయితే ఈ వివాదాన్ని సీరియస్‌గా తీసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో పాటు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై వేటు వేసింది. . గవర్నింగ్ బాడీతో చర్చల అనంతరం వారిద్దరూ తమ పదవుల నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని తెలిపింది. 
 
అత్యవసరమనుకుంటే ఈ వ్యవహారాన్ని మ్యాచ్‌ ముగిసేలోపు విచారిస్తామని.. ప్రస్తుతం జరుగుతున్న ఈ టెస్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వికెట్ కీపర్ టిమ్ పైనీ వ్యవహరిస్తాడని సీఏ సీఈఓ జేమ్స్ సదర్లాండ్ చెప్పారు.

ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు తమ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెటర్ల నుంచి సత్ప్రవర్తనను ఆశిస్తున్నారు. కేప్ టౌన్ టెస్టు మ్యాచ్ సందర్భంగా అలాంటి ప్రవర్తనా నియమావళి కనిపించలేదని సదర్లాండ్ ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చి చంపేసిన ప్రియుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

సినీ కార్మికుల సమ్మె వెనుక కుట్ర - రాజీనామాలు చేసిన కాదంబరి కిరణ్

తర్వాతి కథనం
Show comments