Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముల్లును ముల్లుతోనే దెబ్బ తీయాలంటే స్పిన్నర్లే ముద్దంటున్న ఆసీస్

భారత్‌ను భారత్‌లో ఓడించడం ఫేస్ బౌలిర్లకు వల్లకాదని గ్రహించడంతో వ్యూహం మార్చిన క్రికెట్ ఆస్ట్రేలియా యాజమాన్యం స్పిన్నర్లకే పట్టం గట్టింది. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఉపఖండంలో ఆడే జట్టులో నలుగురు స్పిన్నర్లను ప్రయోగించనుండటం ఇదే మొదటిసారి.

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (01:35 IST)
ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతను ఆసీస్ క్రికెట్ జట్టు కూడా బాగా వంటబట్టించు కున్నట్లుంది. ఫిబ్రవరిలో భారత్‌లో జరగ నున్న టెస్ట్ సీరీస్‌కు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడం ద్వారా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పినట్లయింది. భారత్‌ను భారత్‌లో ఓడించడం ఫేస్ బౌలిర్లకు వల్లకాదని గ్రహించడంతో వ్యూహం మార్చిన క్రికెట్ ఆస్ట్రేలియా యాజమాన్యం స్పిన్నర్లకే పట్టం గట్టింది. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఉపఖండంలో ఆడే జట్టులో నలుగురు స్పిన్నర్లను ప్రయోగించనుండటం ఇదే మొదటిసారి. 
 
ఫిబ్రవరి, మార్చి మాసాల్లో భారత్‌లో జరిగే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. భారత్‌తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్కు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు నలుగురు స్పెషలిస్టు స్పిన్నర్లను ఎంపిక చేసింది. భారత్లో స్పిన్ పిచ్లపై రాణించాలంటే స్పిన్నర్లే కరెక్టుగా భావించిన ఆసీస్.. ఆ మేరకు జట్టును ఎంపిక చేసింది.

ఈ టెస్టు సిరీస్ ద్వారా స్పిన్నర్ మిచ్ స్వెప్సాన్ అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. అతనితో పాటు స్పిన్నర్లు అస్టాన్ అగర్, నాధన్ లయన్, సెఫెన్ ఓ కీఫ్లను ఆసీస్ స్క్వాడ్లో ఎంపిక చేసింది. మరొకవైపు ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ సేవలను ఐదో స్పిన్ ఆప్షన్గా ఆసీస్ ఉపయోగించుకోనుంది. రెండేళ్ల తర్వాత గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ పునరాగమనం చేయనున్నాడు. 
 
భారత్‌తో సీరీస్ కోసం 16 మంది కూడిన జట్టును ఆసీస్ ఆదివారం ప్రకటించింది. 2004 నుంచి భారత్‌లో ఆస్ట్రేలియా ఒక్క టెస్టు కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో భారత స్పిన్ పిచ్‌లపై స్పిన్ తోనే విజయం సాధించాలనే తలంపుతో జట్టు వ్యూహాలనే మార్చివేశారు.  
 
టెస్టు జట్టు: స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), వార్నర్, అగర్, బర్డ్, హ్యాండ్స్‌కోంబ్, హాజల్‌వుడ్, ఖాజా, లియోన్, మిచెల్‌, షాన్‌ మార్ష్, మ్యాక్స్‌వెల్, స్టీవ్‌ ఒకీఫ్, రెన్‌షా, స్టార్క్, స్వెప్‌సన్, వేడ్‌.  
 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments