Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ : చెత్తగా ఆడాం.. అందుకే ఓడాం.. క్లార్క్

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2015 (12:19 IST)
యాషెస్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న తాము చెత్తగా ఆడామని అందుకే ఓడినట్టు ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ చేతిలో కేవలం రెండున్నర రోజుల్లోనే ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిన విషయంతెల్సిందే. 
 
ఈ ఓటమిపై క్లార్క్ స్పందిస్తూ ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌లో బ్యాటింగ్‌ వైఫల్యం కారణంగానే ఓడినట్టు చెప్పాడు. తనతో పాటు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ చెత్త ప్రదర్శన చేశారన్నాడు. తన ఆట జట్టుపై తీవ్ర ప్రభావం చూపిందన్నాడు. ‘ఇంగ్లండ్‌ మెరుగైన బౌలింగ్‌తో మమ్మల్ని త్వరగా ఆలౌట్‌ చేసింది. ఈ మ్యాచ్‌కు మా సన్నద్ధత సరిగా లేదని భావిస్తున్నాం. కఠినంగా శ్రమించినట్టయితే మైదానంలో జట్టు ఆత్మవిశ్వాసం పెరిగేది. రోజర్స్‌, వార్నర్‌ మినహా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. ఇక మిగతా సిరీస్‌లో నేను ఫామ్‌లోకి రావడం అత్యవసరమ’ని క్లార్క్‌ చెప్పాడు.
 
కాగా, ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 265 పరుగులు చేసింది. అలాగే, ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 281 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 124/2 పరుగులు చేయడంతో ఎనిమిది వికెట్ల విజయాన్ని సాధించింది. కాగా, ఈ రెండు ఇన్నింగ్స్‌లలో క్లార్క్ కేవరం 10, 3 చొప్పున పరుగులు చేశారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments