Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసీస్‌కు మంచికాలమేనా? కోహ్లీ సేనకు కష్టాలు తప్పవా?.. పనేసర్ ప్రణాళికలు పనిచేస్తాయా?

ఇప్పటికే భారత గడ్డపై జరిగిన క్రికెట్ సిరీస్‌ల్లో మెరుగ్గా ఆడలేకపోవడంతో పరాజయాలను మూటగట్టుకున్న ఆస్ట్రేలియా.. క్రీజులో ధీటుగా రాణించేందుకు రెడీగా ఉంది. ఇంగ్లండ్ జట్టుకు స్పిన్నర్ గా విశేష సేవలందించిన భ

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (17:47 IST)
భారత గడ్డపై ఇప్పటికే జరిగిన క్రికెట్ సిరీస్‌ల్లో మెరుగ్గా ఆడలేకపోవడంతో పరాజయాలను మూటగట్టుకున్న ఆస్ట్రేలియా.. క్రీజులో ధీటుగా రాణించేందుకు రెడీగా ఉంది. ఇంగ్లండ్ జట్టుకు స్పిన్నర్ గా విశేష సేవలందించిన భారత సంతతి క్రికెటర్ మాంటీ పనేసర్ ఆస్ట్రేలియా జట్టుకు సేవలందించబోతున్నాడు.

భారత్ పర్యటనలో టీమిండియాను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉన్న ఆసీస్ బోర్డు... దానికి తగ్గ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే పనేసర్‌ను ఆసీస్ జట్టుకు సలహాదారుగా నియమించింది. ఇతని సలహాలతో భారత్‌కు దెబ్బేనని క్రీడా పండితులు చెప్తున్నారు. 
 
ఇప్పటికే 2012-13 సీజన్లో భారత గడ్డ మీద భారత్‌ను ఓడించిన జట్టులో పనేసన్ కీలక సభ్యుడు. అంతేగాకుండా ఆ సిరీస్‌లో పనేసర్ 17 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియా పర్యటనలో పనేసర్ సలహాలు కీలకం కానున్నాయని ఆసీస్ బోర్డు భావిస్తోంది.

ఈ వారం రోజుల్లో ఆసీస్ జట్టుతో కలవనున్నాడు పనేసర్. ఆసీస్ స్పిన్నర్లకు సలహాలు ఇవ్వనున్నాడు. ప్రధానంగా లెఫ్టామ్ స్పిన్నర్లయిన స్టీవ్ ఓ కీఫ్, మాట్ రెన్ షాలకు పనేసర్ సలహాలు ఇస్తాడని ఆసీస్ టీమ్ హై పర్ఫామెన్స్ మేనేజర్ హోవార్డ్ తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

యూకే పర్యటన కోసం పర్మిషన్ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు

Madhavi Latha: తాడిపత్రి వాళ్లు పతివ్రతలు కాబట్టి సినిమాల్లోకి రాకండి.. మాధవీ లత

పవన్ కల్యాణ్‌కు తలనొప్పి తెస్తున్న రేవ్ పార్టీలు.. మళ్లీ కొత్త కేసు.. ఎక్కడ?

Kumari Aunty : కుమారి ఆంటీ వ్యాపారంతో ట్రాఫిక్ జామ్.. వారం పాటు బంద్..

చైనాను చుట్టేస్తున్న HMPV వైరస్, లక్షణాలేంటి? భారత్ పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: కాశీలో సాధువును కలిసిన రేణు దేశాయ్.. విశ్వాసం మేలు చేస్తుంది.. (video)

విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన యాక్షన్ మూవీ కోర టీజర్

రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌ లోని సాంగ్ కు డాన్స్ చేసిన గౌతమ్ వాసుదేవ మీనన్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టెక్నికల్ టీమ్ మార్పు !

ఇన్ని కండోమ్‌లైతే కన్యలు దొరకడం కష్టమే, ఐతే మేకలు, కుక్కలతో శృంగారం కోసం కొనండి: చిన్మయి ఘాటు రిప్లై

తర్వాతి కథనం
Show comments