Webdunia - Bharat's app for daily news and videos

Install App

గబ్బా టెస్ట్ మ్యాచ్ : ఆస్ట్రేలియా ఆధిపత్యం.. రెండో రోజు స్కోరు 405/7

ఠాగూర్
ఆదివారం, 15 డిశెంబరు 2024 (15:57 IST)
గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు పూర్తిగా తన ఆధిక్యాన్ని చూపించింది. రెండో రోజైన ఆదివారం ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఆసీస్ బ్యాటర్లు ట్రావిడ్ హెడ్, స్టీవెన్ స్మిత్‌లు సెంచరీలు సాధించగా, భారత బౌలర్లలో జస్ప్రీత్ బూమ్రా ఐదు వికెట్లతో రాణించారు. బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా మూడో టెస్ట్ మ్యాచ్ గబ్బా వేదికగా జరుగుతున్న విషయం తెల్సిందే. 
 
ఈ మ్యాచ్‌లో తొలి రోజు వర్షార్పణమైంది. ఓవర్ స్కోరు 38/0తో ఆదివారం బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్.. 405 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాజా 21, మెక్‌స్వినీ 9, మార్నస్ లబుషేన్ 12, స్టీవెన్ స్మిత్ 101, ట్రావిస్ హెడ్ 152, మిచెల్ మార్ష్ 5, అలెక్స్ క్యారీ 45 (బ్యాటింగ్), ప్యాట్ కమ్మిన్స్ 20, మిచెల్ స్టార్క్ 7 (బ్యాటింగ్) చొప్పున పరుగులు సాధించారు. 
 
భారత బౌలర్లలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోమారు బంతితో రాణించి, ఐదు కీలకమైన వికెట్లు తీశాడు. సెంచరీ హీరోలు ట్రావిడ్ హెడ్, స్మిత్, ఓపెనర్లు ఖవాజా, మెక్‌స్వినీ, మిచెల్ మార్ష్‌లను ఔట్ చేశాడు. 
 
సిరాజ్, నితీశ్‌ కుమార్ రెడ్డిలు తలో వికెట్ తీయడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా సంపూర్ణ ఆధిక్యం చూపించి ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింద. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు వన్డే తరహాలో బ్యాటింగ్ చేయడం గమనార్హం. కాగా. తొలి రెండు టెస్టుల్లో ఇరు జట్టూ తలా ఒక్కో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపు లోక్‌సభలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు!!

ఢిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్‌పై మాజీ సీఎం కొడుకు పోటీ!!

గతంలో తెలుగు భాషపై దాడి జరిగింది : మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

రాంగ్ ఫోన్ కాల్ వాజేడు ఎస్ఐ హరీశ్ ప్రాణం తీసింది.. : యువతి అరెస్టు

కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేయడం ఇష్టంలేక.. చేతి వేళ్లను నరుక్కున్నాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

తర్వాతి కథనం
Show comments