Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాకు చేదు అనుభవం: కిట్ బ్యాగుల్ని మోసుకుని.. వాళ్లే వ్యానుల్లో లోడ్ చేసుకున్నారు..

భారత్‌లో మరో పర్యాటక జట్టైన ఆస్ట్రేలియాకు చేదు అనుభవం ఎదురైంది. ముంబై ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చినా ఈ ఘటన పెద్ద వివాదానికి దారితీస్తోంది. పర్యాటక జట్టుకు గౌరవించగా పోగా, ఇంత దా

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (12:45 IST)
భారత్‌లో మరో పర్యాటక జట్టైన ఆస్ట్రేలియాకు చేదు అనుభవం ఎదురైంది. ముంబై ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చినా ఈ ఘటన పెద్ద వివాదానికి దారితీస్తోంది. పర్యాటక జట్టుకు గౌరవించగా పోగా, ఇంత దారుణంగా అవమానిస్తారా? అంటూ ఆస్ట్రేలియన్ మీడియా ప్రశ్నిస్తుందంటే ఈ విషయం ఎక్కడి వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ విషయంపై ఆసీస్ క్రికెటర్లు బహిరంగంగా స్పందించకపోవడం విశేషం.
 
ఇంతకీ ఏం జరిగిందంటే? నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం భారత్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు విమానాశ్రయం నుంచి బయటికి వచ్చే సమయానికి వారి బ్యాగుల్ని తీసుకెళ్లే వాళ్లెవ్వరూ కనిపించలేదు. మామూలుగా అయితే బోర్డు వారి కోసం ఏర్పాట్లు చేయాలి. కానీ అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లే స్వయంగా వారి పెద్ద పెద్ద కిట్‌ బ్యాగుల్ని మోసుకుని బయటికి తీసుకొచ్చారు. 
 
అంతేకాదు వారి కిట్ బ్యాగులను తీసుకెళ్లే వ్యానులో వాళ్లే లోడ్ చేసుకున్నారు. జట్టు సభ్యుడు వార్నర్‌ ఎక్కి స్మిత్‌ నుంచి కిట్‌ బ్యాగును అందుకుంటున్న చిత్రం సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తోంది. దీనిపై ఆస్ట్రేలియా మీడియా గుర్రుగా ఉంది. ఒకప్పుడు బీసీసీఐ అంటే గొప్ప ధనిక బోర్డు.. పర్యాటక జట్టుకు గొప్పగా మర్యాదలు చేసే బోర్డు అని చెప్పుకునేవారు. కానీ ఈ మధ్య బోర్డులో జరుగుతున్న తతంగాలతో దేశం పరువు బజారుకు వచ్చేసింది. 
 
మొన్నటికి మొన్న ఇంగ్లండ్ క్రికెటర్లకు హోటల్ గదులను సర్దుబాటు చేయలేక వారిని పూణెలోనే ఉంచేసిన ఘటన మరువక ముందే, తాజాగా భారత్‌లో మరో పర్యాటక జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. పర్యాటక జట్టు అయిన ఆస్ట్రేలియాను గౌరవించకపోయినా.. ఇంత దారుణంగా అవమానిస్తారా? అంటూ ఆస్ట్రేలియన్ మీడియా ప్రశ్నించింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments