Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిగ్గజ స్పిన్నర్ సరసన అశ్విన్.. తొలి భారత బౌలర్‌గా రికార్డు (video)

Webdunia
గురువారం, 14 నవంబరు 2019 (17:18 IST)
శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. ఓ స్పిన్న దిగ్గజం. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అలాంటి క్రికెటర్ సరసన భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. అతి తక్కువ టెస్టుల్లో 359 వికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలర్‌గా నిలిచాడు. అంతేనా.. స్వదేశంలో కేవలం 42 టెస్టుల్లో 250 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ అరుదైన ఫీట్‌ను సాధించిన తొలి భారత బౌలర్ కావడం గమనార్హం. 
 
ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌ - భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్ రెండో సెషన్‌లో బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్ మొమినల్ హక్ (37) పరుగుల వద్ద క్లీన్‌బౌల్డ్ చేశాడు. తద్వారా స్వదేశంలో అతి తక్కువ టెస్టుల్లో 250 వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సాధించాడు. 
 
కాగా, 2011 నవంబరు ఆరో తేదీన టెస్ట్ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన అశ్విన్... ఇప్పటివరకు మొత్తం 69 టెస్టులాడి 359 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 27 సార్లు ఐదు వికెట్లు సాదించాడు. 10 వికెట్లను 7సార్లు సాధించాడు. అయితే టెస్టుల్లో సొంతగడ్డపై శ్రీలంక స్పిన్నర్ ముత్తయ మురళీధరన్ 42 టెస్టులు ఆడి 250 వికెట్లు తీసుకున్నాడు. భారత దిగ్గజ బౌలర్ మాజీ సారధి అనిల్ కుంబ్లే 43 టెస్టులో ఈ ఘనత సాధిస్తే, అశ్విన్ మాత్రం 42 టెస్టుల్లోనే మైలురాని అందుకున్నాడు. 
 
మరో భారత స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ సొంత గడ్డపై 51 టెస్టుల్లో 250 వికెట్లు తీశాడు. కానీ, 42 టెస్టుల్లోనే ఈ ఫీట్ సాధించి మురళీధరన్ రికార్డును సమం చేశాడు. వీరి తర్వాత శ్రీలంక మరో బౌలర్ హెరాత్ (44), డేల్ స్టెయిన్ (49) మైలురాయిని అందుకున్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments