Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున అవార్డుకు ఆ ముగ్గురు: ధ్యాన్‌చంద్, ద్రోణాచార్య అవార్డుకు ఆ ఇద్దరు!

Webdunia
బుధవారం, 11 మే 2016 (18:46 IST)
ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు ముగ్గురు క్రీడాకారుల పేర్లను హాకీ ఇండియా ప్రతిపాదించింది. క్రీడారంగంలో ప్రతిష్టాత్మక పురస్కారమైన ఈ అవార్డు కోసం భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ రీతు రాణి, పురుషుల జట్టులో సీనియర్‌ ఆటగాడు వీఆర్‌ రఘునాథ్‌, ఆసియా క్రీడల్లో పతకం సాధించిన జట్టు సభ్యుడు ధర్మవీర్‌సింగ్‌ను ప్రతిపాదిస్తున్నట్లు హాకీ ఇండియా జనరల్‌ సెక్రటరీ మహ్మద్‌ ముస్తాఖ్‌ అహ్మద్‌ వెల్లడించారు. 
 
ఇకపోతే.. మాజీ ఆటగాడు సిల్వనస్‌ దంగ్‌ దంగ్‌ను మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జీవిత సాఫల్య పురస్కారానికి, ప్రముఖ కోచ్‌ సీఆర్‌ కుమార్‌ను ద్రోణాచార్య అవార్డుకు హాకీ ఇండియా ప్రతిపాదించింది. 1980లో ఒలింపిక్‌ బంగారు పతకం సాధించిన భారత జట్టులో మాజీ ఆటగాడు దంగ్‌ దంగ్‌ ఒకరు కావడం గమనార్హం.

పురుషుల హాకీ జట్టులో ఒకడైన రఘునాథ్‌ 2005లో పాకిస్థాన్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో పాటు ప్రస్తుతం అదే జోరును కొనసాగిస్తున్నాడు. అలాగే ధర్మవీర్‌ సింగ్ ఒలింపిక్‌ అథ్లెట్‌గా పేరొందాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Solar Eclipse In 100 Years : ప్రపంచం మొత్తం చీకటైపోతే ఎలా ఉంటుంది?

భారత గగనతలంపై పాకిస్థాన్ విమానాలపై నిషేధం పొడగింపు

Nara Lokesh: మంగళగిరిలో పెట్టుబడులు పెట్టడానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా వున్నాయ్: నారా లోకేష్

క్వార్ట్జ్ అక్రమ రవాణాలో వైకాపా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. అరెస్టు తప్పదా?

ఆరేళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం.. చాక్లెట్లు కొనిపెడతానని.. మద్యం మత్తులో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tanushree Dutta: నన్ను వేధిస్తున్నారు, కాపాడండి, తనుశ్రీ కన్నీటి పర్యంతం (video)

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

తర్వాతి కథనం
Show comments