Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ జోన్ అండర్-16 జట్టులో అర్జున్ సచిన్.. వసీమ్ అక్రమ్ ట్రైనింగ్.. సత్తా చాటుతాడా?

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (17:02 IST)
క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వెస్ట్ జోన్ అండర్-16 జట్టుకు ఎంపికయ్యాడు. తద్వారా ఇంటర్ జోనల్ టోర్నమెంట్‌లో భాగంగా జరిగే మ్యాచ్‌‌ల్లో అర్జున్ తన సత్తా ఏంటో నిరూపించుకోనున్నాడు. ఈ నెల 24వ తేదీ నుంచి హూబ్లీలో ప్రారంభమైన వెస్ట్ జోన్ కెప్టెన్‌గా ఓమ్ భోస్లే వ్యవహరిస్తున్నాడు. 
 
బరోడా క్రికెట్ సంఘం కార్యదర్శి స్నేహల్ పారిక్ వెస్ట్ జోన్ టీమ్‌ను ప్రకటించారు. మే24న ప్రారంభమైన ఈ టోర్నమెంట్ జూన్ 6 వరకు జరుగుతుంది. క్రికెట్ లెజెండ్ కుమారుడు ఎలా ఆడతాడో అని సచిన్ ఏ మేరకు రాణిస్తాడోనని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని బరోడా క్రికెట్ సంఘం వెల్లడించింది.
 
ఇప్పటికే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించే అర్జున్.. గత ఏడాది పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీమ్ అక్రమ్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. ఇంకా గత ఏడాది జరిగిన యాషెస్ సిరీస్ సమయంలో ఇంగ్లండ్ క్రికెటర్లకు బౌలింగ్ చేయడం విశేషం.
 
వెస్ట్ జోన్ అండర్-16 జట్టు వివరాలు : ఓం భోస్లే (కెప్టెన్), వసుదేవ్ పాటిల్, సువేద్ పార్కెర్, సుమిత్ పటేల్, సన్‌ప్రీత్ బగ్గా, యాషాష్వి జైశ్వాల్, దియాన్ష్ సక్సేనా, నీల్ జయదేవ్ (వికెట్ కీపర్), అర్జున్ టెండూల్కర్, యోగేష్ డోంగ్రే, అథర్వా అన్కోలేకర్, సురాజ్ సుర్యల్, సిద్ధార్థ్ దేశాయ్, అక్షయ్ పాండే అండ్ ముకుంద్ సర్దార్. 
 
స్టాండ్ బైస్: కిరణ్ మోర్, సత్యలక్ష్య జైన్, నిహార్ భుయాన్, విఘ్నేష్ సోలంకి, వైభవ్ పాటిల్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

తర్వాతి కథనం
Show comments