Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోచ్ అనిల్ కుంబ్లే వల్లే ఈ ఫీట్ సాధ్యమైంది : అమిత్ మిశ్రా

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే వల్లే తనకు ఈ ఫీట్ సాధ్యమైందని భారత స్పిన్నర్ అమిత్ మిశ్రా అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన ఐదో వన్డేలో 5 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. మ్యా

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2016 (12:08 IST)
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే వల్లే తనకు ఈ ఫీట్ సాధ్యమైందని భారత స్పిన్నర్ అమిత్ మిశ్రా అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన ఐదో వన్డేలో 5 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు మాట్లాడుతూ 'నా కెరీర్ లో ఆరోజు చాలా మంచి ప్రదర్శన చేశాను. నేను వికెట్లు తీయాలని ప్రతిఒక్కరు ఆశిస్తారు. అంచనాలకు అనుగుణంగా రాణించాను. గతంలో సాధించిన వాటి గురించి ఆలోచించలేదు. ఈరోజు మ్యాచ్ పైనే పూర్తిగా దృష్టి పెట్టాను. తదనుగుణంగా బౌలింగ్ చేశాన'ని చెప్పాడు. 
 
టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే తనకు అండగా నిలబడడం వల్లే తానేంటో నిరూపించుకున్నానని అన్నాడు. కుంబ్లే సహకారం ఎప్పటికీ మరువలేనని, తన కష్టానికి ఫలితం దక్కిందని పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అమిత్ మిశ్రా గతంలోనూ సత్తా చాటాడు. రవిచంద్రన్‌ అశ్విన్ విశ్రాంతి తీసుకోవడంతో వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. స్వదేశంలో పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో ముగిసిన 5 వన్డేల సిరీస్‌లో 15 వికెట్లు పడగొట్టి ఈ టోర్నిలో టాప్ బౌలర్‌గా నిలిచాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments