Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందే ఊహించా.. టెస్టుల్లో రాణించడం కలిసొచ్చింది: మురళీ విజయ్

Webdunia
మంగళవారం, 30 జూన్ 2015 (17:58 IST)
జింబాబ్వే టూర్‌కు వెళ్తున్న భారత జట్టులో స్థానం దక్కించుకోవడం పట్ల బ్యాట్స్ మెన్ మురళీ విజయ్ హర్షం వ్యక్తం చేశాడు. సీనియర్లకు విశ్రాంతినిచ్చి.. యువకులకు బీసీసీఐ అవకాశం కల్పించడంతో మురళీ విజయ్‌కి వన్డే జట్టులో చోటు దక్కింది. దీనిపై మురళీ విజయ్ స్పందిస్తూ... తనకకు మళ్లీ భారత వన్డే జట్టులో స్థానం దక్కుతుందని ముందే ఊహించినట్లు చెప్పాడు. 
 
జింబాబ్వేలో పర్యటించే భారత జట్టులో స్థానం దక్కడం సంతోషంగా ఉందన్నాడు. ఇంకా విజయ్ మాట్లాడుతూ.. టెస్టుల్లో రాణించిన తర్వాత తన ఆత్మవిశ్వాసం మరింత మెరుగు పడిందని చెప్పాడు.

2013 ఛాంపియన్స్ ట్రోఫీ సహా నాలుగు సిరీస్‌లకు మూడో ఓపెన‌ర్‌గా తనను జట్టులోకి తీసుకున్నా, ఆడటానికి మాత్రం అవకాశం రాలేదని తెలిపాడు. అయితే, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, టెస్టుల్లో రాణించానని చెప్పుకొచ్చాడు. ఇకపోతే జింబాబ్వే టూర్లో మెరుగైన ప్రదర్శనతో రాణించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని మురళీ విజయ్ వెల్లడించాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments