Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరు టెస్ట్ : సఫారీలను తిప్పేసిన భారత స్పిన్నర్లు... 214 రన్స్‌కే సౌతాఫ్రికా ఆలౌట్

Webdunia
శనివారం, 14 నవంబరు 2015 (15:39 IST)
బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఫ్రీడమ్ సిరీస్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక సౌతాఫ్రికా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో సఫారీ జట్టు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ బ్యాట్స్‌మెన్లు మరోమారు స్పిన్ ధాటికి కుప్పకూలారు. బ్యాటింగ్ పిచ్‌గా పేరొందిన ఈ స్టేడియం కూడా స్పిన్‌కు దాసోహమైంది. దీంతో సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు ఆలౌట్ అయింది. 
 
ఇందులో ఓపెనర్లు వాన్ జిల్ 10, ఎల్గర్ 38, ప్లెసిస్ 0, ఆమ్లా 7, డి విలియర్స్ 85, డుమ్నీ 15, విలాస్ 15, అబ్బాట్ 14, రబడ 0, మోర్కెల్ 22, తాహిర్ 0 చొప్పున పరుగులు చేశారు. వీరిలో జిల్, ఎల్గర్‌లు అశ్విన్, జడేజాల ఉచ్చులో ఆరంభంలోనే చిక్కుకుని పెవిలియన్ దారిపట్టారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు కూడా స్పిన్ బౌలర్లకు ఎదురొడ్డి నిలబడలేక పోయారు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్, జడేజాలు నాలుగేసి వికెట్లు తీయగా, అరోన్ ఓ వికెట్ తీశాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments