Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీమలో వైట్ ఫంగస్: బెంబేలెత్తుతున్న జనం

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (13:30 IST)
ఒకవైపు బ్లాక్ ఫంగస్ వ్యాధితో బెంబేలెత్తుతుంటే తాజాగా కర్నూలు జిల్లాలో వైట్ ఫంగస్ కేసు నమోదు కావడంతో జనం ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఈ ఫంగస్ వెలుగోడు మండలం గుంతకందాలకు చెందిన షేక్ జొల్లు బాషాకి సోకినట్లు వైద్యులు తెలిపారు. అతడిని వెంటనే కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 
మరోవైపు బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో అనేక కేసులు నమోదైవున్నాయి. ఈ నేపథ్యంలో ఫంగస్‌పై ముఖ్యమంత్రి జగన్ అత్యున్నత సమీక్షను నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,179 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని సీఎంకు అధికారులు వివరించారు. వీరిలో 1,068 మందికి వైద్యం అందుతోందని... 97 మంది ఫంగస్ నుంచి కోలుకున్నారని చెప్పారు. 14 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
 
అయితే, కరోనా వైరస్ సోకని వారికి కూడా ఈ బ్లాక్ ఫంగస్ సోకుతుందని, ఇలాంటి వారు రాష్ట్రంలో 40 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు ఎక్కువగా ఈ ఫంగస్ బారిన పడుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా జగన్ కీలక ఆదేశాలను జారీ చేశారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి అవసరమైన మందులు, ఇంజెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. 
 
దీనికి సమాధానంగా అధికారులు మాట్లాడుతూ... ఇంజెక్షన్లు కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల ఆధారంగానే రాష్ట్రానికి వస్తున్నాయని, మందులను మాత్రం అవసరమయినంత మేరకు సిద్ధం చేసుకుంటున్నామన్నారు. ప్రత్యామ్నాయ ఇంజెక్షన్ల కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments