'కరోనా వైరస్‌'పై విజయ్ దేవరకొండ ప్రచారం...

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (16:44 IST)
టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు. పైగా, చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ఈ వైరస్ బారినపడకుండా ఉండొచ్చని ఆయన చెప్పుకొచ్చారు. అంటే.. ఈ కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపి ఓ వీడియోను రిలీజ్ చేశారు. 
 
ఈ వీడియోలో ఈ యువ హీరో మాట్లాడుతూ, కరోనా వైరస్‌ను అరికట్టాలంటే.. ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దని, 'నమస్కారం' చేయాలని, తరచుగా చేతిని సబ్బుతో కడుక్కోవాలని సూచించారు. కళ్లు, ముక్కు, నోటిని, చెవిని చేతితో తాకవద్దని, ఎవరైనా దగ్గుతున్న, తుమ్ముతున్న వారి నుంచి కనీసం 3 అడుగుల దూరంలో ఉండాలని సూచించారు. 
 
అలాగే, అధిక జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల నుంచి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎవరికైనా కరోనా వైరస్ సోకినట్టు, లేదా దానికి సంబంధించిన లక్షణాలు ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే 104కు ఫోన్ చేయాలని ఆ వీడియోలో సూచించారు. ఈ వీడియోను తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారికంగా విడుదల చేసింది. కాగా, తెలంగాణాలో ఈ వైరస్ బారినపడిన బెంగుళూరు టెక్కీ ఈ వైరస్ నుంచి కోలుకున్నాడు. ఈయన్ను త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anupama Parameswaran: క్రేజీ కల్యాణం నుంచి అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే పోస్టర్

Suhas: నా ముందే ఒకాయన సెట్‌లో ఇతన్నెందుకు పిలిచారు అన్నాడు: సుహాస్‌

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments