Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌కు కరోనా పాజిటివ్ - లక్ష దాటిన కేసులు

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (13:28 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ 50 వేల మందికి పైగా మహారాష్ట్ర వాసులు ఈ వైరస్ బారినపడుతున్నారు. వీరిలో సినీ సెలెబ్రిటీలు, వీఐపీలు కూడా ఉన్నారు. తాజాగా మరో ఇద్ద‌రు క‌రోనా బారిన ప‌డ్డారు. న‌టుడు విక్కీ కౌశ‌ల్‌, న‌టి భూమి ప‌డ్నేక‌ర్‌ల‌కు క‌రోనా సోకింది. 
 
ఈ విష‌యాన్ని వాళ్లే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డించారు. అన్ని ముందు జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా త‌న‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింద‌ని, డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు ఇంట్లో ఉంటూనే మందులు వాడుతున్న‌ట్లు విక్కీ కౌశ‌ల్ త‌న ఇన్‌స్టాలో చెప్పాడు. త‌నో స‌న్నిహితంగా ఉన్న వాళ్లు టెస్టులు చేయించుకోవాల‌ని కోరాడు.
 
అటు భూమి కూడా ఇన్‌స్టా ద్వారానే త‌న‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలిన విష‌యాన్ని చెప్పింది. ఇప్ప‌టికైతే త‌నెకు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు తెలిపింది. ఆవిరి ప‌ట్టుకుంటూ, విట‌మిన్‌-సి, మంచి ఆహారం తీసుకుంటూ, హ్యాపీ మూడ్‌లో ఉంటూ క‌రోనాను ఎదుర్కొంటాన‌ని భూమి చెప్పింది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిని ఎవ‌రూ తేలిగ్గా తీసుకోవ‌ద్ద‌ని సూచించింది.
 
ఇదిలావుంటే, దేశంలో క‌రోనా కేసులు భారీ సంఖ్య‌లో పెరిగిపోతున్నాయి. దేశంలో తొలిసారి క‌రోనా కేసుల సంఖ్య ల‌క్ష దాటింది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 17న‌ దేశంలో గ‌రిష్ఠంగా 97,894 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. ఇప్పుడు ఆ రికార్డు దాటి గ‌త 24 గంటల్లో 1,03,558 మందికి కరోనా నిర్ధారణ అయింది.
 
వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 52,847 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,25,89,067కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 478 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,65,101కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,16,82,136 మంది కోలుకున్నారు. 7,41,830  మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 7,91,05,163 మందికి వ్యాక్సిన్లు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments