దేశంలో కొత్తగా 62 వేల పాజివిట్ కేసులు .. తెలంగాణాలో ఎన్ని?

Webdunia
ఆదివారం, 28 మార్చి 2021 (11:34 IST)
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. దీంతో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం 62 వేల మంది కరోనా బారినపడగా, గత 24 గంటల్లో మరో 62,714 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,19,71,624కు చేరింది. ఇందులో 1,13,23762 మంది బాధితులు వైరస్‌ బారినుంచి బయటపడ్డారు. మరో 1,61,552 మంది మృతిచెందారు.
 
కరోనా బాధితులతోపాటు యాక్టివ్‌ కేసుల సంఖ్యకూడా క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం 4,86,310 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 312 మంది కరోనా బాధితులు మరణించారు. కొత్తగా 28,739 మంది డిశ్చార్జీ అయ్యారు. 
 
కాగా, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. నిన్నటివరకు 6,02,69,782 మంది కరోనా టీకా వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రణాంతక వైరస్‌ మళ్లీ పంజా విసురుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. 
 
విస్తృతంగా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలో నిన్న ఒక్కరోజే 11,81,289 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. దీంతో మార్చి 27 వరకు మొత్తం 24,09,50,842 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.
 
రాష్ట్రంలో కొత్తగా 535 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా ముగ్గురు మరణించగా, 278 మంది వైరస్‌ బారినుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,06,339కు చేరాయి. ఇందులో 3,00,156 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. మరో 1688 మంది మహమ్మారి వల్ల మరణించారు. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 4495 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
 
ఇందులో 1979 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 154 ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.06 శాతం, మరణాల రేటు 0.55 శాతం ఉన్నదని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న 57,942 మందికి కరోనా పరీక్షలు చేశారు. దీంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,00,19,096కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya : సూర్య చిత్రం కరుప్పు కు తెలుగు టైటిల్ వీరభద్రుడు గా ఖరారు

Vijay Deverakonda: వారి గత జన్మలలోని వివాహ చిత్రం గా రణబాలి : రాహుల్ సంకృత్యన్

కొత్త కోణంలో ఇచట లవ్ అమ్మబడును కొనబడును చిత్రం రివ్యూ

ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ గ్లింప్స్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు సాన

అడివి శేష్ డెకాయిట్‌ కు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments