Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో విషమిస్తున్న పరిస్థితి... ఒకే రోజులో పదివేల కేసులు

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (11:21 IST)
అమెరికాలో కరోనా వైరస్ మరింతగా విషమిస్తోంది. ఒకే రోజులో పదివేల కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మంగళవారం ఒక్క రోజే అమెరికాలో ఏకంగా 10 వేల కేసులు నమోదు కాగా, 150 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా అమెరికాలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 68489కు చేరుకోగా, 1032 మంది మృతి చెందారు. 
 
ముఖ్యంగా న్యూయార్క్‌లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. ఒక్క రోజే 53 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా 5 వేల మందికి కరోనా సోకింది. అలాగే, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, మిచిగన్, ఇల్లినాయిస్, ఫ్లోరిడాలలోనూ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. 
 
ఇక, తొలి కరోనా కేసు నమోదైన వాషింగ్టన్‌లో మాత్రం కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. అమెరికా తాజా పరిస్థితిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఏప్రిల్ 12 నాటికి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
మరోవైపు, ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభ‌న కొన‌సాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల‌తోపాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా విప‌రీతంగా పెరుగుతున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచ దేశాల్లో మొత్తం 21,116 క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఇక క‌రోనా పాజిటివ్ కేసులు కూడా 5 ల‌క్ష‌ల‌కు చేరువ‌య్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు 4,65,274 మందికి క‌రోనా వైర‌స్ పాజిటివ్‌గా తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments