కేంద్ర మంత్రి ధర్మేంద ప్రధాన్‌కు కరోనా పాజిటివ్

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (10:19 IST)
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఉన్న మంత్రుల్లో కరోనా వైరస్ సోకిన మంత్రుల సంఖ్య రెండుకు చేరింది. ఇప్పటికే కేంద్రం హోం మంత్రి అమిత్ షాకు ఈ వైరస్ సోకగా, ఆయన గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. 
 
ఇపుడు కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే డాక్టర్ల సూచనతో గురుగ్రామ్‌లోని మేదాంత ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.
 
కాగా, తనకు కరోనా సోకడం పట్ల ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని, రిపోర్టులో పాజిటివ్ అని వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు.
 
మరోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కాంటాక్ట్ అయిన కేంద్ర మంత్రులు రవిశంకర ప్రసాద్, బాబుల్‌లు ఇప్పటికే సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. అలాగే, మరికొందరు ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments