దేశంలో కొత్తగా మరో 7447 కరోనా కేసులు - 391 మంది మృతి

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (10:42 IST)
దేశంలో కొత్తగా మరో 7447 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 391 మంది ఈ వైరస్ కారణంగా చనిపోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రటనను విడుదల చేసింది. 
 
గత 24 గంటల్లో మొత్తం 7447 మందికి ఈ వైరస్ సోకిందనీ, 391 మంది చనిపోయారని అందులో పేర్కొంది. అలాగే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 86,415 మంది వివిధ ఆస్పత్రులు, క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. అలాగే గత 24 గంటల్లో ఈ వైరస్ నుంచి 7,886 మంది కోలుకున్నారు. 
 
ఇకపోతే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 3,41,62,765 మందికి ఈ వైరస్ సోకగా, 4,76,869 మంది చనిపోయారు. దేశంలో ఇప్పటివరకు 1,35,99,96,267 మందికి కరోనా వ్యాక్సిన్ డోస్‌లను వేశారు. 
 
తెలంగాణాలో 7 ఒమిక్రాన్ కేసులు  
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నాలుగు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణాలో 7కి చేరింది. దేశ వ్యాప్తంగ 87కు పెరిగింది. మరోవైపు, కర్నాటక రాష్ట్రంలోనూ కొత్తగా ఐదు కేసులు వెలుగుచూశాయి. వీరిందరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారే కావడం గమనార్హం. దీంతో ప్రతి ఒక్కరిలోనూ ఇపుడు ఆందోళన మొదలైంది. 
 
కాగా, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే, మహారాష్ట్రలో 32, రాజస్థాన్‌లో 17, ఢిల్లీలో 10, కర్నాటకలో 8, తెలంగాణాలో 7, కేరళలో 5, గుజరాత్‌లో 5 చొప్పున కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైంది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 87కు చేరింది. ఇదిలావుంటే, దేశంలో కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ క్రమంగా విస్తరిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర ఆవిష్కరణ : రూ.761 కోట్లు దాటిన 'ధురంధర్ : ది రివెంజ్'

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments