Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కరోనా ఉధృతి.. 24 గంటల్లో 2400 మంది మృతి

Webdunia
గురువారం, 26 నవంబరు 2020 (16:45 IST)
అగ్రరాజ్యం అమెరికాను కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 2400మందిని ఈ మహమ్మారి బలిగొంది. గత ఆరు నెలల్లో ఒక్క రోజే భారీ సంఖ్యలో మరణించడం ఇదే తొలిసారి అని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ పేర్కొంది. థ్యాంక్స్‌గివింగ్ హాలీడేస్ ప్రారంభమైన ఈ తరుణంలో కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. 
 
గురువారం ఒకే రోజు 2,439 మందిని ఈ వైరస్ పొట్టనబెట్టుకోవడంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 262,080కు చేరింది. అలాగే బుధవారం ఒక్కరోజే సుమారు రెండు లక్షల కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
 
మరోవైపు జనాలు ముఖానికి మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలను ఉల్లంఘించడం కూడా కొత్త కేసుల పెరుగుదలకు ప్రధాన కారణమని అధికారులు అంటున్నారు. 
 
థ్యాంక్స్‌గివింగ్ వేడుకల సందర్భంగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ మాట్లాడుతూ.. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ను ప్రజలకు చేరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే మీరు సాధారణ జీవితం గడపబోతున్నారు.. ఇది జరిగి తీరుతుందని బైడెన్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

తర్వాతి కథనం
Show comments