Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల డొల్లతనం.. బొప్పాయి పండుకు పాజిటివ్

Webdunia
మంగళవారం, 5 మే 2020 (12:03 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరనా వైరస్ ఎవరికి సోకింది.. ఎవరికి సోకలేదు అని నిర్ధారించేందుకు పలు దేశాలు తమకు అందుబాటులో ఉన్న దేశాల నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకున్నాయి. అలాంటి దేశాల్లో భారత్, టాంజానియా దేశాలు కూడా ఉన్నాయి. ఇందులో భారత్ పొరుగు దేశమైన చైనా నుంచి ఈ కిట్లను దిగుమతి చేసుకుంది. అలాగే, టాంజానియా కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. అయితే ఈ కిట్లలోని డొల్లతనాన్ని టాంజానియా పరిశోధనాశాల పసిగట్టింది. ఫలితంగా దిగుమతి చేసుకున్న మొత్తం కిట్ల వాడకాన్నీ నిషేధించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కరోనా వైరస్ పరీక్షా కిట్లను టాంజానియా దిగుమతి చేసుకోగా, వీటితో గొర్రెలు, బొప్పాయి పండ్లు, మేకలపైనా పరీక్షించారు. ఓ గొర్రెలో, బొప్పాయి పండులో కరోనా వైరస్ ఉందని ఈ టెస్టింగ్ కిట్లు నిర్ధారించాయి. దీంతో నివ్వెరపోయిన శాస్త్రవేత్తలు.. ఈ కిట్లను నిశితంగా తనిఖీ చేయగా, వాటిలో సాంకేతిక లోపాలు ఉన్నట్టు గుర్తించారు. 
 
ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, మొత్తం కిట్ల వాడకాన్ని తక్షణం నిలిపివేయాలని దేశ అధ్యక్షుడు జాన్ మగుపులి ఆదేశాలు జారీచేశారు. ఈ కిట్లతో పరీక్షలు చేస్తే, కొంతమంది కరోనా బాధితుల్లో వైరస్ లేదని వచ్చిందని అన్నారు. తదుపరి దర్యాఫ్తునకు ఆయన ఆదేశించారు. కాగా, టాంజానియాలో ఇప్పటివరకూ 480 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 17 మంది మరణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments