Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ వారంలోనే సాధారణ ప్రజలకు కరోనా వ్యాక్సిన్.. పుతిన్

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (22:20 IST)
ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా అంతం చేయడానికి ప్రపంచంలోనే తొలి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌గా స్పుత్నిక్-వీ నమోదైందని అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ విస్తృత పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ వారంలోనే సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 
రష్యా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గమలేయ రిసెర్ట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రోబయాలజీ ఈ వ్యాక్సిన్‌ను అభివృధ్ది చేసింది. ప్రజల వినియోగం కోసం ఓ బ్యాచ్ టీకాను విడుదల చేసేందుకు గమలేయ ఇన్‌స్టిట్యూట్‌కు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని రష్యా అకాడెమీ సైన్సెస్ అసోసియేట్ మెంబర్ డెనిస్ అన్నారు. 
 
సెప్టెంబర్ 10 నుంచి 13 మధ్య ప్రజల వినియోగం కోసం ఓ బ్యాచ్ టీకాను విడుదల చేసేందుకు తాము అనుమతి పొందుతామనే నమ్మకం ఉందని తెలిపారు. అప్పటి నుంచి జనాలకు వ్యాక్సినేషన్ ఇవ్వడం ప్రారంభం అవుతుందని డెనిస్ తెలిపారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ పంపిణీ ఉంటుందని తెలిపారు.
 
రష్యా వ్యాక్సిన్‌పై పోస్ట్ రిజిస్ట్రేషన్ క్లినికల్ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ వ్యాక్సిన్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించకుండానే, టీకాను ఆమోదించి, విడుదల చేయడంపై నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితం? అనే చర్చ జరుగుతోంది.
 
ఈ సందేహాలకు చెక్ పెడుతూ.. లాన్సెట్‌ జర్నల్‌ రష్యా వ్యాక్సిన్‌‌పై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. 76 మందిపై వ్యాక్సిన్‌ ప్రయోగం చేయగా.. వాళ్లలో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కన్పించలేదని, 42 రోజుల పాటు క్లినికల్‌ ట్రయల్స్‌ తర్వాత ఈ విషయాలు బయటపడ్డాయని తెలిపింది. 21 రోజుల్లోనే వాలంటీర్లలో యాంటీబాడీస్‌ తయారైనట్టు లాన్సెట్‌ జర్నల్‌ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments