Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంతువులకు కూడా కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది.. పేరేంటో తెలుసా?

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (10:42 IST)
మనుషులకు కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. ప్రస్తుతం రష్యా మొట్టమొదటిసారిగా జంతువులకు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకువచ్చింది. ఈ వ్యాక్సిన్ పేరు కార్నివాక్-కోవ్. జంతువులకు ఇచ్చే కోవిడ్ టీకాను రష్యా రష్యాకు చెందిన వ్యవసాయ సంబంధిత శాఖ రూజుల్‌కోజ్‌నడార్ ఈ టీకాలను ఉత్పత్తి చేస్తుంది. క్లినికల్ ట్రయల్స్ లో ఇది కుక్కలు, పిల్లులు, నక్కలు, మింక్స్ వంటి జంతువుల్లో యాంటీబాడీలను ఉత్పత్తి చేసినట్టు గుర్తించారు. 
 
వ్యాక్సిన్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదని, ఇమ్యూనిటీ అధిక స్థాయిలో ఉన్నట్లు గ్రహించామని అధికారులు చెప్పారు. గత ఏడాది అక్టోబర్‌లో ఈ టీకా ట్రయల్స్ స్టార్ట్ అయ్యాయి. వ్యాక్సిన్ తీసుకున్న జంతువులు నూటికి నూరు శాతం కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలను డెవలప్ చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయనున్నారు.
 
మనుషులు, జంతువుల మధ్య కరోనా వైరస్ వ్యాప్తిపై ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై రష్యా అగ్రికల్చరల్ రెగ్యులేటరీ స్పందిస్తూ, జంతువుల్లో కరోనా వ్యాప్తిని ఈ వ్యాక్సిన్ అరికడుతుందని, ప్రమాదకరమైన ఉత్పరివర్తనాల నుంచి కరోనా కొత్త వేరియంట్లు తయారుకాకుండా అడ్డుకుంటుందని వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments