Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీకా వేయించుకున్న ప్రధాని మోడీ! టీకా వేసిన నర్సు పేరేంటి?

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (07:50 IST)
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఉదయం కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా ఈ రోజు నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగి, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకా ఇవ్వనున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని నరేంద్ర మోడీ తొలి డోసు టీకాను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దేశప్రజలంతా కొవిడ్‌ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ‘మనమందరం కలిసికట్టుగా భారత్‌ను కొవిడ్‌ రహిత దేశంగా తీర్చిదిద్దాలని’ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా ప్రధాని నరేంద్ర మోడీ భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాను తీసుకున్నారు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో పనిచేస్తున్న సిస్టర్‌ పి.నివేదా ప్రధానికి టీకా సిరంజ్ ద్వారా ఇచ్చారు. ఈ సందర్భంగా కరోనాపై వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ప్రధాని కొనియాడారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ కాంబోలో యుఫోరియా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ డాకు మహారాజ్ షూటింగ్ పూర్తి

ప్రభాస్ లో డెడికేషన్ చూశా, పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

'పుష్ప-2' త్రీడీ వెర్షన్‌ విడుదలకు ముందు చిక్కులు... ఏంటవి?

అర్థరాత్రి బెన్ఫిట్ షోలు ఎవరి బెన్ఫిట్ కోసం వేస్తున్నారు? : తెలంగాణ హైకోర్టు ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments