Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా వైరస్ దూకుడు : కొత్తగా 48 వేల మందికి సోకిన వైరస్

Webdunia
శనివారం, 25 జులై 2020 (10:30 IST)
దేశంలో కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా గడచిన 24 గంటల్లో మరో 48916 మందికి ఈ వైరస్ సోకింది. శనివారం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల మేరకు... గత 24 గంటల్లో భారత్‌లో 48,916 మందికి కొత్తగా కరోనా సోకింది. అదేసమయంలో 757 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
 
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 13,36,861కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 31,358కి పెరిగింది. 4,56,071 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 8,49,431 మంది కోలుకున్నారు. 
 
కాగా, శుక్రవారం వరకు దేశంలో మొత్తం 1,58,49,068 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. శుక్రవారం ఒక్కరోజులోనే 4,20,898 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది 
 
ఇదిలావుంటే, తెలంగాణలో కరోనా వైరస్ భూతం విజృంభణ కొనసాగుతోంది. తాజాగా 1,640 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 52,466కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎప్పట్లాగానే భారీ సంఖ్యలో కరోనా కేసులు వెల్లడయ్యాయి. 
 
గడచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 683 మందికి పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలో మరో 8 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 455కి పెరిగింది. ఇవాళ 1,007 మంది డిశార్జి కాగా, ఇంకా 11,677 మంది చికిత్స పొందుతున్నారు.

అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల్లో ఏరోజుకారోజు కొత్త రికార్డు నమోదవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 48,114 మందికి పరీక్షలు నిర్వహించగా... 8147 మందికి  వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది.

కరోనా కేసులు 8వేల మార్కును తాకడం వరుసగా ఇది రెండో రోజు. దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో  కేసుల సంఖ్య లక్ష దాటింది. ఈ జాబితాలో త్వరలో ఏపీ కూడా చేరనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments