యూరప్ దేశాల్లో కరోనా విలయతాండవం.. 17సెకన్లకు ఒక మరణం

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (18:21 IST)
యూరప్ దేశాల్లో మహమ్మారి విలయం సృష్టిస్తుండటంతో కొన్ని దేశాలు మళ్లీ లాక్‌డౌన్ బాటపట్టాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 5.73కోట్ల మంది కరోనా బారినపడగా.. 13.67లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇంకా యూరప్ దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. ప్రతి 17సెకన్లకు ఒక కరోనా మరణం నమోదవుతుందని డబ్ల్యూహెచ్‌ఓ యూరప్ రీజినల్ డైరెక్టర్ హాన్స్ క్లూజ్ తెలిపారు.
 
యూరప్ దేశాల్లో కరోనా విలయం కొనసాగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యూరప్ దేశాల్లో మహమ్మారి విజృంభిస్తున్న తీరును హాన్స్ క్లూజ్ మీడియాకు వివరించారు. గత వారంలో యూరప్‌లో 29వేల కరోనా మరణాలు నమోదైనట్లు చెప్పారు. 
 
ఈ లెక్కన కరోనా మహమ్మారి బారినపడి ప్రతి 17 సెకండ్లకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారంటూ అంచనా వేశారు. 'యూరప్‌లో గత వారం 29వేల కరోనా మరణాలు నమోదయ్యాయి. అంటే ప్రతి 17 సెకండ్లకు ఒకరు మరణిస్తున్నారు' అని ఆయన వ్యాఖ్యానించారు. 
 
కాగా.. గత వారంలో యూరప్‌లో కరోనా మరణాలు 18శాతం పెరిగినట్లు హాన్స్ క్లూజ్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో సుమారు 28శాతం కేసులు యూరప్‌ దేశాల్లోనే నమోదయ్యాయని చెప్పారు. అదే మరణాల విషయాన్ని వస్తే 26శాతం మరణాలు ఇక్కడే సంభవించాయని హాన్స్ క్లూజ్ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments