దేశంలో కరోనా కేసులు పైపైకి... తెలంగాణాలోనూ మారని సీన్

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (10:50 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి జోరుగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు ల‌క్ష‌ల‌కు మించి న‌మోద‌య్యాయి. తాజాగా కొత్త‌గా 4,14,188 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసింది. ఆ లెక్కల ప్రకారం నిన్న 3,31,507 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 2,14,91,598కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 3,915 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య  2,34,083కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,76,12,351 మంది కోలుకున్నారు. 36,45,164 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 16,49,73,058 మందికి వ్యాక్సిన్లు వేశారు.
 
మరోవైపు, తెలంగాణలో బుధవారం రాత్రి 8 గంట‌ల నుంచి గురువారం రాత్రి 8 గంటల మ‌ధ్య 5,892 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేసమయంలో 9,122 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,81,640కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 4,05,164 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,625గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 73,851 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,104 మందికి క‌రోనా సోకింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments