Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో 215 మంది పోలీసులకు కరోనా.. దేశంలో 776 మంది మృతి

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (14:54 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా పోలీసులే అధికంగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. నిత్యం వందలాది పోలీసులు కరోనా బారినపడుతున్నారు. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 215 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో వైరస్ సోకిన పోలీసుల సంఖ్య 23,033కు చేరింది. ఇందులో 19,681 మంది కోలుకోగా ప్రస్తుతం 3,107 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
మరోవైపు కరోనాతో ఇప్పటి వరకు 245 మంది కాప్స్ మరణించారు. కరోనా కేసులు, మృతుల పరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.35 లక్షలు దాటగా 35 వేల మందికిపైగా మరణించారు.
 
మరోవైపు దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 70,589 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 61 లక్షల 45 వేలకు చేరింది. 
 
గడిచిన 24 గంటలలో దేశంలో కరోనా కారణంగా మొత్తం 776 మంది మృతి చెందగా.. దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 84,877 డిశ్ఛార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 96,318 మృతి చెందగా.. మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 51,01,397కి పెరిగింది. దేశ వ్యాప్తంగా 9,47,576యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments