మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 423మంది మృతి

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (21:18 IST)
మహారాష్ట్రలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రంలో కరోనా మరణాలు 27వేలు దాటాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో 423 మంది వ్యాధి బారిన పడి మరణించగా ఇప్పటివరకు మొత్తం 27,027 మంది మృత్యువాత పడ్డారని మంగళవారం వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 
 
ఇవాళ 16,429 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 9,23,641కి చేరుకుంది. తాజాగా 14,922మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా మొత్తం 6,59,322మంది రికవర్ అయ్యారు. ప్రస్తుతం 2,36,934 యాక్టీవ్ కేసులున్నాయి.
 
అలాగే దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 43 లక్షలకు చేరువవగా, మరణాల రేటు దిగిరావడం సానుకూల పరిణామమని అధికారులు పేర్కొన్నారు. ఆగస్ట్‌ తొలి వారంలో కరోనా మహమ్మారి బారినపడి మరణించేవారి సంఖ్య 2.15 శాతం ఉండగా, ఇప్పుడది ఏకంగా 1.7 శాతానికి దిగివచ్చిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments