Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కరాళ నృత్యంతో దేశంలో రికార్డు.. పీజీ హాస్టల్ వంట మనిషికి పాజిటివ్

Webdunia
శనివారం, 2 మే 2020 (10:04 IST)
దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఫలితంగా ఒకే రోజులో రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో ఎన్నడూ నమోదుకాని రీతిలో ఈ కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల మేరకు గత 24 గంటల్లో 2,293 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,218కి చేరింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 37,336కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 9,950  మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 26,167  మంది చికిత్స పొందుతున్నారు.
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో 411 కరోనా కేసులు నమోదైవున్నాయి. తాజాగా కర్నూలు వైద్య కాలేజీలోని పీజీ హాస్టల్‌లో పనిచేసే వంట మనిషికి కరోనా సోకింది. 
 
స్థానిక వర్గాలు అందించిన సమాచారం మేరకు ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో హాస్టల్‌లో ఉన్న విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు చేయనున్నారు. ఆ తర్వాత వీరిని హోం క్వారంటైన్‌లో ఉంచాలా లేక ఐసోలేషన్‌కు తరలించాలా? అనే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని స్థానిక అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments