జూన్ 21న కొత్త కరోనా కేసులెన్ని... 88 రోజుల కనిష్ట స్థాయిలో...

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (10:29 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. మరోవైపు, థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అంటే జూన్ 21వ తేదీన దేశంలో కొత్తగా మరో 53256 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవి 88 రోజుల క‌నిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. 
 
దేశంలో గత 24 గంటల్లో 53,256  క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం... ఆదివారం 78,190 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,99,35,221కు చేరింది. మరో 1,422 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,88,135కు పెరిగింది.
 
ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,88,44,199 మంది కోలుకున్నారు. 7,02,887 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. వ్యాక్సినేషన్ కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 28,00,36,898 డోసులు ఇచ్చారు.
 
మరోవైపు, దేశంలో ఆదివారానికి మొత్తం 39,24,07,782 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 13,88,699 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments