Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో బెంబేలెత్తిస్తున్న కరోనా ... మరికాస్త తగ్గిన పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (10:40 IST)
దేశంలో కరోనా వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 3403 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే కొత్తగా 91,702 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. 
 
ఇదిలావుంటే, గత 24 గంటల్లో 1,34,580 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,92,74,823కు చేరింది. మరో   3,403 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,63,079కు పెరిగింది. 
 
ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,77,90,073 మంది కోలుకున్నారు. 11,21,671 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 24,60,85,649 మందికి వ్యాక్సిన్లు వేశారు.
                     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 37,42,42,384 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 20,44,131 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
మరోవైపు, తెలంగాణలో గురువారం నాటి లెక్కల ప్రకారం 1,30,430 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,798 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. జీహెచ్ఎంసీ పరిధిలో 174, ఖమ్మం జిల్లాలో 165, నల్గొండ జిల్లాలో 151 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 6 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలో 2,524 మంది కరోనా నుంచి కోలుకోగా, 14 మంది మరణించారు.
 
తెలంగాణలో ఇప్పటిదాకా 5,98,611 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,71,610 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 23,561 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 3,440కి చేరింది. అటు, రాష్ట్రంలో కరోనా కేసుల రికవరీ రేటు మరింత పెరిగి 95.48 శాతానికి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments