Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర జైలులో ఖైదీలకు కరోనా.. ఇంద్రాణి ముఖర్జి ఆ జైలులోనే..?

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (12:00 IST)
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌తో కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో మూడు లక్షలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 2,95,041 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో 2,023 మంది బాధితులు మృతి చెందారు.
 
అలాగే కరోనాకు మహారాష్ట్ర హాట్ స్పాట్‌గా మారింది. మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. గత రెండు వారాలుగా రోజూ 50 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. బయటి జనాలనేగాక ఇప్పుడు జైల్లో ఖైదీలను కూడా కరోనా గడగడలాడిస్తుంది. 
 
ముంబైలోని బైకులా జైల్లో ఇవాళ 38 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. షీనా బోరా హత్యకేసులో దోషిగా తేలిన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జి కూడా ప్రస్తుతం ఆ జైల్లోనే శిక్ష అనుభవిస్తుంది. కరోనా పాజిటివ్ వచ్చిన 38 మంది ఖైదీల్లో ఇంద్రాణి కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments