వాడిన బ్రష్‌నే మళ్లీ వాడకూడదట.. టూత్ బ్రష్‌లో 72 గంటల పాటు కరోనా..?

Webdunia
మంగళవారం, 18 మే 2021 (19:36 IST)
Brush
కరోనా బారిన పడిన వారు కరోనా సమయంలో వాడిన బ్రష్ మళ్లీ వాడితే మరోసారి కరోనా బారినపడే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది. బ్రెజిల్‌ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో టూత్‌ బ్రష్‌ల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలను దంత వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
 
మొదటి సారి కరోనా సోకిన సమయంలో వాడిన బ్రష్ ను పడేయకుండా వాడటం వలన కొందరు రెండవసారి కరోనా బారినపడినట్లు అధ్యయనాల్లో తేలింది. టూత్ బ్రష్‌లో 72 గంటల పాటు కరోనా సజీవంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు.
 
కరోనా సోకిన వ్యక్తి 14 రోజుల తర్వాత తన పాత బ్రష్ ను పక్కకు పడేసి కొత్త టూత్ బ్రష్ వాడాలని చెబుతున్నారు. అంతే కాదు కరోనా పేషెంట్ వాడే వస్తువుల పక్కన ఇతరుల వస్తువులు పెడితే వారికి కూడా కరోనా వచ్చే అవకాశం ఉందని తేల్చారు. 
 
వాష్‌రూమ్‌ల్లో ఇతర కుటుంబ సభ్యుల టూత్‌ బ్రష్‌లు, టంగ్‌క్లీనర్లు, టూత్‌ పేస్ట్‌లతో పాటు ఇతర టాయిలెట్‌ వస్తువులు/సామగ్రిని ఉంచకూడదని సూచిస్తున్నారు. 
 
కోవిడ్‌ బాధితులు నోటి శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని. నోటిలో వైరస్‌/బ్యాక్టీరియా నివారణకు గోరు వెచ్చటి ఉప్పునీటిని పుక్కిలించాలని దంతవైద్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments