Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెకండ్ వేవ్: తెలంగాణలో కరోనా.. కొత్తగా 158 కేసులు

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (11:41 IST)
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో చేసిన కరోనా టెస్టులకుగాను 0.38 శాతం మందిలో కరోనా వైరస్‌ ఉన్నట్టు బయటపడింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు 24 గంటల్లో 40,616 నమూనాలకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో 158 మంది కోవిడ్‌-19 బారిన పడ్డట్టు వెల్లడైంది.
 
తాజాగా కరోనాతో ఒకరు మరణించడంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1641కు చేరింది. మరో 628 మంది రిపోర్టులు రావాల్సి ఉన్నాయి. తాజాగా జోగులాంబ గద్వాల, కామారెడ్డి, ములుగు, వనపర్తి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. జీహెచ్‌ఎంసీలో 30, రంగారెడ్డి15, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. అతి తక్కువగా కొమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఒకరు వ్యాధి బారిన పడ్డారు.
 
ఇకపోతే.. దేశంలోనూ గత కొన్ని రోజులుగా రోజుకు 16 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న తరుణంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అయితే తాజాగా దేశంలో కరోనా కేసులు మరింత పెరిగాయి. 
 
ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 18,599 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,29,398 కి చేరింది. ఇందులో 1,08,82,798 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,88,747 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 97 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,57,853 కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments